ప్రతీ సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా మీకు వీడ్కోలు చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను ......ఇంతకీ నేను ఎవరు అనుకుంటున్నారా ....2012 సంవత్సరాన్ని .....ఎప్పటిలాగే మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది'......కానీ అంతకంటే దారుణమైన దిగ్బ్రాంతి, అవమానం నన్నుమరింత బాధకు గురి చేస్తున్నాయి ....డిల్లీ సంఘటన తలుచుకుంటే ..
నేను ప్రపంచం మొత్తం తిరుగుతున్నా ఎందుకో భారతదేశం అంటే వల్లమాలిన అభిమానం ,ప్రేమ ...శాంతి కాముక దేశమని ,సంస్కృతి ,సంప్రదాయాలు అంటే గౌరవం ఇస్తారని ,ముఖ్యం గా ఆడవాళ్ళంటే పరమ పవిత్రం గా చూస్తారని మా పూర్వీకులు ,పెద్దవాళ్ళు(2011,2010,2009.....) ఎంతో గొప్పగా చెప్పడం వల్ల అనుకుంటా ..
కానీ వాస్తవిక పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి ...మానవ మృగాల పాశవికత్వానికి బలైన సంఘటన భారతదేశ పరువును మంటగలపడమే కాక ,అసలు మనము నాగరిక సమాజంలో ఉంటున్నామా ,లేక తిరిగి ప్రాచీన యుగం వైపు వెళ్తున్నామా అన్న సందేహం కలిగిస్తుంది ....{.గర్భం లో ఆడ పిల్ల అని తెలిస్తే చంపేస్తునారు.... ,ప్రేమించకపోతే చంపేస్తున్నారు...కట్నం తేకపోతే చంపేస్తున్నారు ఎన్నాళ్లీ దౌర్భాగ్యం ....}
ఇంతటి హేయమైన సంఘటన జరిగినా మన పాలకుల స్పందన చూస్తే మనం ఏ యుగం లో ఉన్నామా అన్న సందేహం తప్పక కలుగుతుంది .... ఇంత బాధలో కూడా నాకు సంతోషాన్నిచ్చిన విషయం ఏంటంటే ....భారతదేశం మొత్తం ఈ సంఘటన కి వ్యతిరేకంగా ఒకే తాటి ఫై నిలబడడం,న్యాయం కోసం పోరాడడం ....ఇంకా నాకు భారతదేశం మీద ఉన్న గౌరవం మిగిలి ఉంది....... ఇప్పటివరకు మీ దేశం లో "" పోస్ట్ మార్టం "" చర్యలు(ఏదయిన సంఘటన జరిగాక మాత్రమే స్పందించే ప్రభుత్వాలు ........నివారణ చర్యలు శూన్యం ....) మాత్రమే చూసాను.....కానీ ఇక ఫై అలా జరగకూడదు .....ఆమె మరణం వృధా పోకూడదు ..... నిందితులకి సరైన శిక్ష పడేలా దేశం మొత్తం కదలి వచ్చి ఇంకా మీ దేశం లో న్యాయం బ్రతికే ఉందని నిరూపించండి ....
శిక్షల విషయానికొస్తే వాళ్ళకి వేసే శిక్షలు మళ్లీ "అలాంటి" ఆలోచన వస్తేనే వెన్నులో భయం పుట్టేలా ఉండాలి ...."రసాయనక పుంస్త్వనాశనము" మాత్రమే స్త్రీల ఫై జరిగే అరాచకాలకు సరైన సమాధానం .......ఇలాంటి చర్యలకు ఇదే సరైన సమయం .....భవిష్యత్తులో మీ దేశ స్త్రీలు ధైర్యంగా బతకాలన్నాకఠిన చర్యలు అనివార్యం .....
ఇంతటి నిందని మోస్తూ విషాద హృదయం తో నేను మీకు వీడ్కోలు చెబుతున్నా ......కనీసం నా వారసుడి (2013) సమయం లో నైనా ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు ......ఆమె చనిపోయింది.......కనీసం న్యాయాన్ని బతికించండి .....ఆమెని గెలిపించండి .....
మీ ,
2012......