నా అంతరాత్మ!!!
  • Home
  • Poems
  • Short stories
  • Articles
  • Web Series
  • Reviews
    • Movies
      • Telugu
      • English
    • Apps
  • Uncategorized

Sunday, 20 July 2014

Madhyatharagathi Batukulu - Part 1

 RamKi     08:09     Stories, Telugu     No comments   



"ఒరేయ్ ఒకసారి బయటకి రారా నీతో మాట్లాడాలి ఎప్పుడూ కంప్యూటర్ ముందు కూర్చొని ఎం చేస్తావ్ రా " డాడీ పిలిచారు. ఎందుకో తెలీదు కానీ ఏదో ఉపద్రవం ముంచుకొస్తుంది అనిపించింది. బయటకి వచ్చా. "ఏరా ఈసారి కూడా రాంక్ రాలేదు ఏం చేద్దాం అనుకుంటునావ్" అని అడిగారు . నా అయోమయం మొహం చూసి "హైదరాబాద్ వెళ్లి జాబ్ చూసుకో రా . జాబ్ చేస్తూ కూడా చదువుకొవచ్చు అన్నారు . నాకు ఇంకో సారి ట్రై చేసి అపుడు వెళ్ళాలని ఉంది . కానీ డాడీ ఫిక్స్ అయిపోయారని అర్ధం అయింది. మనకి ఇగో ఒకటి ఏడ్చింది కదా. నా మీద నమ్మకం లేనపుడు నేనెందుకు ఉండాలి ఇక్కడ. వెళ్లి జాబు చేసి CAT  లో రాంక్ కొట్టి నేనేంటో చూపిస్తా అనుకున్నా . చిన్నప్పటి నుంచి ఒకటే, బాగా డబ్బులు సంపాదించాలి. ఊరు మొత్తం లో మన పేరు తెలియని వాడు ఉండకూడదు. అసలు ఊరు కే తోపు అయిపోవాలి . పోనీ తాతలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయా అంటే, తాత ఏమో దాన ధర్మాలు పేరు తో ఆస్తి తగలేసాడు. ఇంక నాన్న నీతి నిజాయతి మట్టి మషానం అంటూ గవర్నమెంట్ ఉద్యోగం లో ఏమి సంపాదించలేదు. పోనీ ఫ్రెండ్స్ సర్కిల్ అన్నా ఉందా అంటే వాళ్ళు మన బాపతే. అందుకే డబ్బు సంపాదించాలి . ఈ మధ్యతరగతి బతుకు నుండి విముక్తి పొందాలి అనుకున్నా  .

"అమ్మా రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నా అని చెప్పి టికెట్ బుక్ చేసుకున్నా "
"ఏరా రెండు రోజులు ఉండొచ్చు కదా అంటే నాకేం సిగ్గు లేదా మీ ఆయన  వెళ్ళిపో అంటే ఉండటానికి అన్నా "
"నీ మంచి కోసమే కదరా అంటే నువ్వు మీ ఆయన ఒకటే నేనే వేరు అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశా .
"నేన్ను డిసైడ్ అయిపోయా " రేపే ప్రయాణం.

గౌతమి ట్రైన్ కోసం కాకినాడ స్టేషన్ లో వెయిట్ చేస్తున్నా . ఇంతలో కొంత మంది స్కూల్ ఫ్రెండ్స్ స్టేషన్ కొచ్చారు. ఏరా మాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావ్ అందుకే స్టేషన్ కి నిన్ను వెతుకుంటూ వచ్చేసాం రా అన్నారు. పని పాటు లేకపోతే ఎం చేస్తార్రా అని మనసులో అనుకొని థాంక్స్ రా అన్నాను బయటకి .

సొల్లు  ఏస్తూ ట్రైన్ వచ్చిన సంగతి మర్చిపోయా. కష్టపడి  S 12 లో ఎక్కా . S 2 కి నడుచుకొని వెళ్ళాలి ఇపుడు  . ఫుల్ జనం. ఈ స్లీపర్ క్లాస్ తో ఇదే ప్రాబ్లం ఎక్కడ చూసినా జనం జనం . ఇదే లాస్ట్ టైం. మళ్లీ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఫ్లైట్ లోనే రావాలి . I hate this middle class life అనుకుని ముందుకు నడుస్తున్నా . చాలా దూరం నడవాలి అదీ ఈ ఎదవ గోల లో అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో విందామని ఒక చెవి అటు పడేసా . ఒకతను చెబుతున్నాడు రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బు తో కూతురు పెళ్లి చేసి విజయవాడ వెళ్తున్నా సర్ అని. అదే డబ్బు లో పుట్టుంటే రిటైర్మెంట్ డబ్బులు మిగిలేవి కదా అంకుల్ అనాలనిపించింది. చేదు నిజాలు వొప్పుకోరు కదా జనం. ఇంకో కంపార్ట్మెంట్ లో ఒరేయ్ టీచర్ జాబ్ వచ్చింది రా , ఊరు చివర ధాబా లో పార్టి ఇస్తా, నే వచ్చాక అని ఒకడు. ఊరు చివర ధాబా లో ఇచ్చేదాన్ని కూడా పార్టీ అంటారా రా అని మనసులో అనుకుని ముందుకు నడిచి వెళ్తున్నా . ఇంకో కంపార్ట్మెంట్ లో చాలా చూడ ముచ్చటగా ఉంది ఒక అమ్మాయి. ఏం మాట్లాడుతుందో విందామని సీట్ వెతుకుతున్న వాడిలా ఏక్షన్ చేస్తూ అక్కడ నిల్చున్నా . నాకు సంబంధం కుదిరింది. నాకు కాబోయే వాడు రైల్వే TTE  అని చెప్పింది. ఛీ బతుకు అనుకొని అక్కడ నుండి నెమ్మదిగా నడుస్తున్నా. పాపం ఆ పిల్ల కి అదృష్టం లేదు. నా లాంటి తొప్ ని చేసుకొనే అదృష్తం మిస్ చేసుకొంది అనుకొని ముందుకి సాగిపోయా. S 12 లోకి వెళ్లి కూర్చున్నా. ఎదవ గోల స్టార్ట్ అయింది. ఏం చేస్తున్నావ్ బాబు అని పక్కాయన. నేనేం చేస్తే నీకెందుకు అని మనసులో అనుకొని జాబ్ కోసం వెళ్తున్నా అన్నా . ఇంకో ప్రశ్న అడిగే లోపు ear phones తీసి చెవిలో పెట్టుకున్నా.

ఉదయం దిగగానే ఫ్రెండ్స్ స్టేషన్ కి వచ్చారు. వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర మెళకువలు నేర్చుకొని ఇంటర్వూస్ కి అటెండ్ అయ్యా. తొందరగానే మంచి జాబ్ వచ్చింది. నెలకి బాగానే వస్తోంది. కానీ ఇంట్లో చేసిన ఛాలెంజ్ కి మన శాలరీ కి అసలు మాచింగ్ లేదు. చిరంజీవి లెవెల్ లో ఛాలెంజ్ చేసి నెలకి ముప్పయ్ వేలు తీసుకుంటే ఎలా ఇంటికి వెళ్ళాలి అనుకొని, మా ఫ్రెండ్ ని అడిగా ఎలా రా డబ్బులు సంపాదించాలి అంటే, onsite పోవాలి రా ఇక్కడ ఉంటే సంపాదించలేం అన్నాడు. onsite పోవాలంటే ముందు మేనేజర్ కి biscuits వెయ్యాలి అన్నాడు. అలాగే రెండు సంవత్సరాలు UK లో ఉండి వచ్చా అని ప్రపంచ కప్ కష్టపడకుండా కొట్టేసిన వాడిలా ఫేస్ పెట్టాడు.  Biscuits కి రెండు examples చెప్పరా అన్నా. ఏముంది రా సింపుల్. మేనేజర్ కుళ్ళు జోక్ వేసినా "Whatta sense of humour sir " అనాలి. వాడు naaptol లో 300 shirt డిస్కౌంట్ లో 100 కి కొన్నా. సర్ whatta shirt  సర్. ఈ షర్టు లో చిరు లా ఉన్నారు సర్ అనాలి. వాడికి ఏదన్నా ప్రాబ్లం వస్తే నాకు తెలుసు సర్ నేను చేస్తా అని చొరవ చూపాలి. తర్వాత పక్కోడిని అడిగి ఆ ప్రాబ్లం ఎలాగోలా చేసేయాలి. ఇవన్ని చేస్తే మరి వర్క్ ఎపుడు చేయాలి రా అన్నా. ఒరేయ్ అమాయక చక్రవర్తి ఇవన్ని చేస్తే వర్క్ ఎందుకు రా అన్నాడు. ఒరేయ్ ఇంకో ప్రాబ్లం ఉంది రోయ్ నువ్వు biscuit వేస్తే మేనేజర్ కి తెలియకూడదు పక్కోడికి తెలిసినా ప్రాబ్లం లేదు. మేనేజర్ కి biscuit వేస్తున్నావని తెలిస్తే ప్లాన్ రివర్స్ కొట్టే ప్రమాదం ఉంది అన్నాడు. వీడు చెప్తే నమ్మాలనిపించింది. నెక్స్ట్ రోజు ట్రై చేద్దాం అనిపించి ఒక biscuit వేసా . గుడ్ మార్నింగ్ సర్. ఇవాళ చాలా యంగ్ గా కనిపిస్తునారు అన్నా. మేనేజర్ పొంగిపోయాడు. మన ప్లాన్ వర్కౌట్ అయినట్టు అనిపించింది. ఇంకా biscuits శాతం పెంచాలి అనుకున్నా. సర్ మీ లాంటి మేనేజర్ ని నా లైఫ్ లో చూడలేదు సర్ అన్నా. ఇదే కదా ఫస్ట్ కంపెని ,జీవితం లో మేనేజర్ ని ఎలా చూస్తావ్ రా ,biscuit రివర్స్ అయ్యేలా ఉంది అని మనసులో అనుకొన్నా. కానీ మేనేజర్ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చాడు. thank you అని. వీడు మనకంటే పొగడ్తలకి ప్రాణం ఇచ్చే టైపు అనుకొంటా అనుకున్నా. continuous గా నెల రోజుల biscuits కి onsite వచ్చింది. US వెళ్ళాలి పదిహేను రోజుల్లో. ప్రపంచాన్ని జయించిన హిట్లర్ లా ఇంటికి కాల్ చేశా, US వెళ్తున్నా అని. డాడీ మంచిది రా అన్నారు. ఏంటి అంతేనా రెస్పాన్స్ అనుకొన్నా. మమ్మీ అయితే ఎపుడు తిరిగి వస్తావ్ రా అంది. ఇంకా వెళ్ళనే లేదు అపుడే తిరిగి రావడమా , ఏంటి వీళ్ళకి నేను ఎదగడం ఇష్టం లేదా అనుకొన్నా. బాగా డబ్బు సంపాదించి అపుడు వస్తా అని ఫోన్ పెట్టేసా.

ఫ్లైట్ తెల్ల వారు జామున 4 కి. డాడీ, మమ్మీ వచ్చారు. దిగాలుగా పెట్టారు మొహాలు. నాకు మాత్రం చాలా హ్యాపీ గా ఉంది. ఏదో సాదించబోతున్నా అని. bye చెప్పేసి ఫ్లైట్ ఎక్కా.

                                                                                                                                     (సశేషం)







Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Newer Posts Older Posts Home

Featured post

My appraisal........

IT లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి తెలిసిన పదం - APPRAISAL . IT  లో లేని వాళ్ళకి బ్రీఫ్ ( సంక్షిప్తముగా)గా చెబుతా .  IT లో కొన్ని కంపెనిల్లో...

Categories

  • 16
  • aquaman
  • Articles
  • avengers
  • batman
  • counts
  • detail
  • english
  • English movies
  • flash
  • Galaxy English
  • Ghazi
  • Guardians
  • Guru
  • hollywood
  • Hugh Jackman
  • hulk
  • India
  • Introduction
  • jai lava kusa
  • justice league
  • karthi
  • katamarayudu
  • Khakhee
  • Logan
  • mahanubhavudu
  • Movies
  • Pakistan
  • Pawan
  • police
  • ragnarok
  • rakul
  • Ritika
  • Sala khadoos
  • Sarcasm
  • serials
  • spyder
  • stark
  • Stories
  • submarine
  • superman
  • Telugu
  • Telugu Dubbed
  • Telugu movie
  • Thor
  • Tollywood
  • Venkatesh
  • war
  • wolverine
  • wonder woman
  • X-Men

Blog Archive

  • ►  2017 (24)
    • ►  November (4)
    • ►  October (1)
    • ►  August (5)
    • ►  July (4)
    • ►  June (4)
    • ►  May (1)
    • ►  March (4)
    • ►  February (1)
  • ►  2016 (7)
    • ►  November (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (3)
  • ▼  2014 (1)
    • ▼  July (1)
      • Madhyatharagathi Batukulu - Part 1
  • ►  2013 (2)
    • ►  September (1)
    • ►  May (1)
  • ►  2012 (9)
    • ►  December (9)

Popular Posts

  • The Jungle Book - DD's review
  • Dashavatharalu - 1...........
  • Dunkirk - DD review
  • Brahmotsavam - DD's review
  • Zootopia - DD's review

Pages

  • Home
Powered by Blogger.

Find us on:

Facebook Twitter Google+

Ads

Total Pageviews

Copyright © నా అంతరాత్మ!!! | Powered by Blogger
Design by Hardeep Asrani | Blogger Theme by NewBloggerThemes.com | Distributed By Gooyaabi Templates