IT లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి తెలిసిన పదం - APPRAISAL . IT లో లేని వాళ్ళకి బ్రీఫ్ (సంక్షిప్తముగా)గా చెబుతా . IT లో కొన్ని కంపెనిల్లో ఏడాదికొకసారి కొన్ని కంపెనిల్లో 6 నెలలకి ఒకసారి రేటింగ్స్(స్కూల్ లో ర్యాంకింగ్ లా) ఇచ్చే పధ్ధతిని appraisal అంటాం . మా మేనేజర్ మనం పోయిన ఏడాది లో మనం ఏం గొప్పగా చేసాం ఏం చెత్తగా చేసాం అని సమీక్షించి చెబుతారు. దానికి తగ్గట్టు నువ్వు ఈ రేటింగ్ లో ఉన్నావ్ అని చెబుతాడు.
మాకు 1,2,3,4,5 రేటింగ్స్ ఉంటాయి. అయితే మొదట్లో దాని అర్ధం తెలుసుకుందామని మా మేనేజర్ ని ఆత్రుతగా అడిగా .
అయన "1 వస్తే ఇంటికి పంపిస్తారు, 2 అంటే 2 ఛాన్స్ లు ఇచ్చి అప్పుడు బయటకి పంపిస్తారు, 3 అంటే నీ రోజూ పని చేస్తూ అపుడు అపుడు ఇరగదియ్యాలి" అని చెప్పాడు. నిజం చెప్పాలంటే అపుడు అపుడు ఇరగదీసే పని నే నేను 5 రేటింగ్ అనుకున్నా. అయితే పరిస్థితి నాకు పూర్తి గా అర్ధం అయింది. మనం 3 లో ఉన్నాం అన్నమాట అని మనసులో అనుకున్నా. అయినా ఒకసారి తెలుసుకుందామని 4,5 గురించి కూడా అడిగా. మా వాడు, "4 అంటే నువ్వు పని చేసే ప్రతి రోజూ ఇరగాదీస్తూనే ఉండాలి అని చెప్పాడు. మనం చేసే maintenance ప్రాజెక్ట్స్ లో రోజూ ఎలా ఇరగదియ్యాలో నాకు అర్ధం కాలేదు. సర్లే తరవాత appraisal లో చూద్దాం అనుకున్నా. 5 గురించి ఇంక తెలుసుకోవలనిపించలేదు.ఆవేశం గా వెళ్లి నీరసం గా బయటకి వచ్చా. సర్లే కదా అని మా seniors ని అడిగా అసలు 5 రావాలంటే ఏం చెయ్యాలని?వాళ్ళు చిన్నగా నవ్వి నీళ్ళ పై కాళ్ళు తడవకుండా నడవాలి. ఆఫీసు కి తలకిందులుగా రావాలి . ఇలాంటి ఫీట్స్ చేయాలి చేస్తావా అని అడిగారు. నేను కూడా నవ్వి ఊరుకున్నా . కానీ నాకు 5 కి అర్ధం తెలియలేదు.
నెక్స్ట్ ఇయర్ ఈ సారి మరీ రోజూ ఇరగదియ్యలేదు కానీ బాగానే కష్టపడి పని చేశా. ఈ సారి తప్పని సరిగా మంచి రేటింగ్ రావాలి అనుకున్నా . కాన్ఫరెన్స్ రూం లోకి అడుగుపెట్టా . మా మేనేజర్ తీక్షణం గా మానిటర్ వైపు చూస్తునాడు. జస్ట్ పలకరించా వెళ్లి కూర్చున్నా. మా మేనేజర్ "ఏంటి సెల్ఫ్ రేటింగ్ లో చాలా పాయింట్స్ రాసినట్టున్నావ్" అన్నాడు. అన్నట్టు సెల్ఫ్ రేటింగ్ అంటే చెప్పడం మర్చిపోయా .మనల్ని మనం రేట్ చేసుకోవాలి.మనం మనకిచ్చిన రేటింగ్ తో మన మేనేజర్ ఏకీభవిస్తే మనకు మంచి రేటింగ్ వస్తుంది. 5 నిమిషాల నిశబ్దం తర్వాత మా మేనేజర్ "సరే లాస్ట్ ఇయర్ ఎం చేసావో చెప్పు అన్నాడు". బాగా ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఒక అరగంట అది చేశాను ఇది చేశాను అని గుక్క తిప్పుకోకుండా ఏం చేసానో చెప్పాను ? మా వాడు సింపుల్ గా "that's all part of job(అదంతా పని లో భాగం)" అని గాలి తీసేసాడు. వారం రోజులనుండి ఏం చెప్పాలి ఎలా మాట్లాడాలి అని చేసిన ప్రాక్టీస్ అంతా వృధా అనిపించింది. నా అయోమయపు మొహం చూసి సరే ఇపుడు నేను చెబుతాను చూడు అని మా మేనేజర్ స్టార్ట్ చేసాడు
"నువ్వు వర్క్ బాగానే చేస్తావ్ కానీ బిహేవియర్ మైనస్ అన్నాడు, నీకు visibility కూడా లేదు " అనగానే నాలో నేను "arguments లో ఎప్పుడు ఉండను కదా. అమ్మాయిలతో కూడా బాగానే behave చేస్తాను కదా,హెల్పింగ్ నేచర్ కూడా ఉంది....కొంపదీసి మా పక్క టీం అమ్మాయికి సైలెంట్ గా సైట్ కొట్టిన విషయం గాని తెలిసిపోయిందా....చివరాకర్లో visibility లేదన్నాడు అది లేకే కదా లెన్స్ పెట్టుకుంటుంది. అది కూడా చూస్తారా!! " అనుకున్నా. సర్లే మన వాడిని అడిగి తెలుసుకుందాం అనుకున్నా . అడిగా. నువ్వు నీ టీం లో ఉన్న వాళ్ళతో మాత్రమే మాట్లాడుతావ్. పక్క టీం వాళ్ళతో అసలు మాట్లాడవు . చాలా reserved గా ఉంటావ్. పని ఉన్నా లేకపోయినా వెళ్లి మాట్లాడాలి అని చెప్పాడు . (పక్క టీం లో అమ్మాయిలు బాగుంటే మాట్లాడుతాం . లేకపోతే ఎందుకు మాట్లాడుతాం అనుకున్నా ). నువ్వెవరో పది మందికి తెలియాలి నువ్వు మహా అయితే మన టీం లో తెలుసు అంతే కదా అన్నాడు. department మొత్తం తెలియాలి అన్నాడు(నేనేమన్నా ఎలక్షన్ లో పోటి చేస్తున్నానా అనుకున్నా ). కానీ నేను బాగానే పని చేశాను కదా అన్నాను. పని ఎవడన్నా చేస్తాడు అన్నాడు. అందుకే నీకు 3 ఇస్తున్నా అన్నాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది . మరి ఆ vishal గాడికి 5 ఎలా ఇచ్చావ్ వాడు అస్సలు పనే చేయడు కదా అన్నాను. మా వాడు వెంటనే "నీకు ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయా నువ్వు emotions ని కంట్రోల్ చేసుకోలేవు, listening స్కిల్స్ కూడా తక్కువ అన్నాడు. ఇపుడే చూసా అన్నాడు " 3 రేటింగ్ తో వచ్చా. అందరిలాగే "న్యాయానికి రోజుల్లేవు,పనికి వేల్యూ లేదు,లోకం పాడయిపోయింది " అని అపుడే M ,Phil కంప్లీట్ చేసిన వాడిలా ఫిలాసఫీ మాట్లాడుకుంటూ బయటకి వచ్చా.
నా తక్షణ కర్తవ్యం అర్ధం కాలేదు. నేను డల్ గా ఉండటం చూసి మా లీడ్ వచ్చి పరిస్థితి అర్ధం చేసుకుని "భయ్యా! నీకు ఇంకా IT అలవాటైనట్టు లేదు. రేటింగ్ లన్నీ ముందే ఫిక్స్ అయిపోతాయి. నీతోనే నువ్వు చేసింది తప్పనిపించి వాళ్ళు అనుకున్నది ఇచ్చే process నే రేటింగ్ అంటారు. ఆ మర్మం తెలుసుకుని వాడిచ్చిన రేటింగ్ ని తీసుకుని calm గా వచ్చేస్తే మన విలువైన సమయం వృధా అవ్వదు." అని ఉపదేశించాడు. మరి 5 ఎవరికి రాదా అని అడిగాను. చిన్నగా నవ్వి "వస్తుంది. బాగా biscuits వెయ్యాలి,సోప్ బాగా రాయాలి,వాడు చెప్పిన పని కాదనకుండా చెయ్యాలి,కుదిరితే ఒక సిగరెట్ వీలైతే నాలుగు పెగ్స్ తో పార్టీ ఇవ్వాలి. అలా చేస్తే అవార్డ్స్ వస్తాయి,రేటింగ్స్ వస్తాయి . అదే మన పని మనం చేసుకుని కాలం వెళ్ళిపోతే మనశాంతి వస్తుంది.ఏది కావాలో తేల్చుకో అని వెళ్ళిపోయాడు ". యుద్ధం లో అస్త్ర శాస్త్రాలు వదిలేసిన అర్జునుడికి కృష్ణుడు భగవద్గీత ఉపదేశించినట్టు అనిపించింది. ఆ తర్వాత ఇయర్ appraisal అంతా చాలా తొందరగా అయిపోయింది ఎందుకంటే మా వాడు చెప్పినట్టు తలాడించి వాడిచ్చింది తీసుకుని బయటకు వచ్చేసా . మనసుకి చాలా బాగా అనిపించింది. ఇదేనా మా లీడ్ చెప్పిన మర్మం అనుకున్నా . appraisals కి అలవాటు పడిపోయా.
(Disclaimer : నాకు రేటింగ్ తక్కువ వచ్చిందని కడుపు మంట తో రాయలేదు. నాకు మా మేనేజర్ మంచి రేటింగ్ ఇచ్చాడు. మా ఫ్రెండ్స్ కి, నాకు జరిగిన అనుభవాలు అన్ని ఒక్కటి గా చేసి రాసింది, సరదా కోసం......చివరిగా అందరి మేనేజర్ లు ఒకేలా ఉండరు.:) )

బహు ముచ్చటగా ఉన్నది నీ వ్యాసం. అభినందిస్తున్నాను !!
ReplyDeleteధన్యవాదాలు :)
ReplyDelete