నా అంతరాత్మ!!!
  • Home
  • Poems
  • Short stories
  • Articles
  • Web Series
  • Reviews
    • Movies
      • Telugu
      • English
    • Apps
  • Uncategorized

Saturday, 14 September 2013

Vulli Gaatu

 RamKi     08:53     Articles, Telugu     No comments   



ఉల్లి ఘాటు 

ఫిట్  నెస్ , డైటింగ్, హెల్త్  గోల లో పడి ఫాస్ట్ ఫుడ్ మానేసారు జనాలు . నేను కూడా అదే కోవ కి చెందినోడిని . ఎందుకో మొన్న ఎగ్ నూడుల్స్ తినాలనిపించి రోడ్ పక్కన  ఆగా . ఒక ఎగ్ నూడుల్స్ ఆర్డర్ ఇచ్ఛా. వాడు ప్లేట్ ఫుల్ గా నూడుల్స్ తెచ్చాడు . cabbage , టమాటో అన్ని రకాల కాయగూరలు కనపడ్డాయి కానీ  ఉల్లి ముక్కలు కనిపించలేదు. మర్చిపోయాడనుకుని భయ్యా మనకు వచ్చీ రాని హిందీ తో "తోడా ఉల్లి డాల్దో" అన్నా . వాడో రెండు ముక్కలు తీసుకోచ్చి వేసాడు. మొత్తం ఉల్లి గడ్డ సైజు లో 1/16త్ ఉన్నాయి. భయ్యా ఇంకో రెండు వెయ్యి అన్నా . ఉల్లి రేట్ బాగా పెరిగిపోయింది అని జాలి గా చూసాడు . నాకు కూడా రెండు ఉల్లి పాయలతో  వాడి పొట్ట కొట్టడం ఎందుకని కామ్  గా నూడుల్స్ తినేసి ఇంటికి వచ్చి కంప్యూటర్ ఆన్ చేశా. Gmail  లో groupon నుండి ఏదో మెయిల్ వచ్చింది . groupon  అంటే ఏదన్న వస్తువు మీద మంచి ఆఫర్ ఉంటే online  లో మనకి అమ్ముతారు. ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ , restaurant డీల్స్ చూస్తుంటాం. ఈ సారి కిలో ఉల్లి గడ్డలు కేవలం 9 రూపాయలు మాత్రమే అని ఉంది . నాలో నవ్వుకున్నా . ఆఖరికి ఉల్లి కూడా online  ఆ అనుకున్నా . చూద్దాం అని క్లిక్ చేశా. స్టాక్ అయిపోయింది కేవలం 3000 కిలోలు 20 నిమిషాలలో అమ్ముడు పోయాయి అని రాసుంది. పిచ్చి జనాలు ఫ్రీ గా వస్తే ఫినాయిల్ కూడా తాగేస్తారు అనుకుని అని నవ్వుకున్నా . 

సండే వచ్చింది. JNTU రైతు  బజార్ కి బయల్దేరా. కూరగాయలు తీసుకున్నా. దూరం గా ఒక పెద్ద లైన్ కనపడింది. ఫ్రీ గా ఎమన్నా పంచిపెడుతున్నారేమో అనుకున్నా. కిలో ఉల్లిపాయలు కేవలం 20 రూపాయలు మాత్రమే అని ఉంది . 20 రుపాయలికి పెద్ద లైన్ ఆ టూ మచ్ అనుకుని లోకల్ షాప్ లో తీసుకుందాం అనుకుని ఇంటికి బయల్దేరా. Online లో 20 నిమిషాలలో 3000 కిలోల అమ్ముడుపోవడం లో మర్మం ఏంటో అర్ధం అయింది. లోకల్ షాప్ కి వెళ్లి కిలో ఉల్లి గడ్డలు ఎంతమ్మా అని అడిగా. 60 రూపాయలు సర్ అన్నాడు. ఒక్కసారిగా కళ్ళు తిరిగాయ్ . వీడు ఉల్లి గడ్డలు అమ్ముతున్నాడా లేక ఉల్లి తోట అమ్ముతున్నాడా అనుకుని సరే అని JNTU రైతు  బజార్ కి వెళ్లా . జనాలు లేరు. కిలో ఉల్లి గడ్డలు ఇవ్వు భయ్యా అన్నాను. స్టాక్ అయిపోయింది రేపు రమ్మన్నాడు. రేపు ఆఫీసు ఉంది ఒక కిలో ఉంటే ఇవ్వు భయ్యా అని బతిమాలా. వాడు అడ్డం గా బుర్ర ఊపాడు. లోకల్ షాప్ లో 60 రూపాయలకి తీసుకుని కార్గిల్ యుద్ధం లో చితకొట్టించుకున్న పాకిస్తాన్ సిపాయి లా ఇంటికి చేరుకున్నా . 

TV ఆన్ చేసి ఛానెల్స్ మరుస్తున్నా. జీ తెలుగు లో "గంగ తో రాంబాబు" అని సీరియల్ వస్తుంది. మాములుగా అయితే సీరియల్స్ చూడం కానీ ఉల్లిపాయ అనే పదం వినిపించి ఛానెల్స్ మార్చడం ఆపి చూస్తున్నా.   హీరోయిన్ ఉల్లిగడ్డ bag దొంగలు ఎత్తుకుపోతారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. వాళ్ళు వెటకారం గా ఉందా అని తిడతారు. ఈ లోపు కంట్రోల్ రూం నుండి ఫోన్ వస్తుంది. ఉల్లి దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయ్  investigate  చెయమని. పోలీస్ లు కేసు ఫైల్ చేసి ఉల్లి దొంగల కోసం వెతుకుతుంటారు.ఈ లోపు ads వచ్చాయ్ . ఉల్లి సెగ సీరియల్స్ కూడా తగిలింది అని నవ్వుకున్నా. 

 మొదట్లో groupon లో 9 రూపాయలవి 20 నిమిషాలలో అయిపోవడం తప్పు లేదు అనుకున్నా . మనకి realization  ఎపుడు లేట్ గానే వస్తుంది. బాగా తీరిన తర్వాత. :)

Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Newer Posts Older Posts Home

Featured post

My appraisal........

IT లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి తెలిసిన పదం - APPRAISAL . IT  లో లేని వాళ్ళకి బ్రీఫ్ ( సంక్షిప్తముగా)గా చెబుతా .  IT లో కొన్ని కంపెనిల్లో...

Categories

  • 16
  • aquaman
  • Articles
  • avengers
  • batman
  • counts
  • detail
  • english
  • English movies
  • flash
  • Galaxy English
  • Ghazi
  • Guardians
  • Guru
  • hollywood
  • Hugh Jackman
  • hulk
  • India
  • Introduction
  • jai lava kusa
  • justice league
  • karthi
  • katamarayudu
  • Khakhee
  • Logan
  • mahanubhavudu
  • Movies
  • Pakistan
  • Pawan
  • police
  • ragnarok
  • rakul
  • Ritika
  • Sala khadoos
  • Sarcasm
  • serials
  • spyder
  • stark
  • Stories
  • submarine
  • superman
  • Telugu
  • Telugu Dubbed
  • Telugu movie
  • Thor
  • Tollywood
  • Venkatesh
  • war
  • wolverine
  • wonder woman
  • X-Men

Blog Archive

  • ►  2017 (24)
    • ►  November (4)
    • ►  October (1)
    • ►  August (5)
    • ►  July (4)
    • ►  June (4)
    • ►  May (1)
    • ►  March (4)
    • ►  February (1)
  • ►  2016 (7)
    • ►  November (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (3)
  • ►  2014 (1)
    • ►  July (1)
  • ▼  2013 (2)
    • ▼  September (1)
      • Vulli Gaatu
    • ►  May (1)
  • ►  2012 (9)
    • ►  December (9)

Popular Posts

  • The Jungle Book - DD's review
  • Dashavatharalu - 1...........
  • Dunkirk - DD review
  • Brahmotsavam - DD's review
  • Zootopia - DD's review

Pages

  • Home
Powered by Blogger.

Find us on:

Facebook Twitter Google+

Ads

Total Pageviews

Copyright © నా అంతరాత్మ!!! | Powered by Blogger
Design by Hardeep Asrani | Blogger Theme by NewBloggerThemes.com | Distributed By Gooyaabi Templates