నా అంతరాత్మ!!!
  • Home
  • Poems
  • Short stories
  • Articles
  • Web Series
  • Reviews
    • Movies
      • Telugu
      • English
    • Apps
  • Uncategorized

Saturday, 25 May 2013

Software Engineer - Na page ki nene hero :):)

 RamKi     00:20     Stories, Telugu     No comments   

హలో నేనొక software ఇంజనీర్ , ఈ కథ నాదే ... చదవండి ......
అవి యుగాంతపు వదంతులు ఇంకా లేని రోజులు, లక్షల కోట్లు స్కామ్స్ చేస్తారని తెలియని రోజులు,కంప్యూటర్ ఇంజనీరింగ్  చదివితే ఫ్లైట్ ఎక్కాల్సిందే అనుకున్న జనాలున్న రోజులు, ఆ రోజుల్లో btech కంప్లీట్ చేసి మే నెల లో ఇంటికి వచ్చాను. వారం రోజులు గడిచాయ్ ఫ్రెండ్స్ తో బాగా తిరిగాను . వారం గడిచాక ఒక ప్రశ్న నన్ను వేదించడం మొదలు  పెట్టింది "తర్వాత ఏంటి ?" GATE రాసా . ఒక మిడిల్ క్లాస్ percentile వచ్చింది - 96 .. IIT లో సీట్ రాదు ..... UNIVERSITIES లో ఇంటరెస్ట్ లేదు . అందరూ రాస్తునారు కదా అని GRE కూడా రాసా ... 1800/2200.... నిజానికి ఆ స్కోర్ ఏం చేసుకోవాలో కూడా తెలీదు . ఇంట్లో ఉంటునా కాని ఒక టెన్షన్ ఎప్పుడు అడుగుతారా తర్వాత ఏంటి అని.... ఆ రోజు రానే వచ్చింది ... డాడీ అడిగారు ఏం చేద్దాం అనుకుంటునావు అని.. ఐఏఎస్  కి ప్రిపేర్ అవుదామనుకుంటున అని చెప్పా .... ముందు మంచి కోచింగ్ సెంటర్ కనుక్కో అని చెప్పారు ... ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్ మంచి ఉత్సాహంగా బయలుదేరా ... యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధం గా ఉన్న సైనికుల్లా luggages పట్టుకుని గోదావరి train దిగాం ... మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ కోసం వెయిటింగ్ .... సర్లే బయటకి వెళ్లి కలుద్దాం అనుకుని కూలీ ని పిలిచాం .. వాడు రావడం రావడం luggage పట్టుకుని నడవడం మొదలుపెట్టాడు ... ఎక్కడో కొట్టేస్తుంది అనుకున్నా ... మా ఊళ్ళో  అయితే అరగంట బేరం ఆడి వాడు 50 అంటే  20 కి ఫైనల్ చేస్తాం ...ఇక్కడ ఫిక్స్ డ్  రేట్స్ అనుకుంటా అనుకుని వాడి వెనకాల వెళ్ళడం మొదలుపెట్టా... వాడు luggage దించి 300 అన్నాడు ... 300 ఆ!! లైఫ్ టైం ఆఫర్ ఏమన్నా నడుస్తుందా అని అడిగా.  వాడికి కాలినట్టుంది . ఇది హైదరాబాద్ ఊరనుకున్నావా అన్నాడు . వెంటనే మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయి వచ్చారు. అయన కొద్దిసేపు ఆర్గుమెంట్ చేసి మొత్తానికి 120 ఇచ్చాం . హిమాయత్నగర్ లో రూం తీసుకున్నాం . రెండు అగ్గిపెట్టె లాంటి గదులు దానికి 4000 రెంట్ . నేను కోచింగ్ జాయిన్ అయ్యా . కొంత మంది GATE కి జాయిన్ అయ్యారు . కొంత మంది జాబ్ సెర్చ్ లో ఉన్నారు. నిజానికి IT  బూమ్ లేదు అపుడు. మా ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ కి వెళ్లి వచ్చే ప్రతి సరి యుద్ధం లో చితకొట్టించుకున్న వాళ్ళ లా తిరిగి వచ్చేవారు.  ఒక సంవత్సరం గడిచింది. సివిల్స్ రాసా . మెయిన్స్ లో పోయింది. మా ఫ్రెండ్స్ కి GATE లో స్కోర్ వచ్చిఇంటికి వెళ్ళిపోయారు. నేను సెకండ్ attempt ఇంటి నుండి తీసుకుందాం అని ఇంటికి పోయా . ఈ సారి కూడా మెయిన్స్ పోయింది . ఈ లోపు ఒక అద్బుతం జరిగింది . IT  బూమ్ వచ్చి ప్రతి అడ్డమైన వాడికి జాబ్స్ వచ్హాయి . నా కర్మ కాలి మా ఫ్రెండ్ కి ఒకడికి జాబ్  వచ్చింది. వాడి గురించి చెప్పాలంటే చిన్నపటినుండి ఇద్దరం కలిసే చదువుకునే వాళ్ళం. వాడికి EAMCET  లో రాంక్ రాలేదు . కష్టపడి MCA చేసాడు . చేసానని చెప్పాడు కంప్లీట్ అయిందో లేదో తెలీదు . ఈ బూమ్ లో వాడికి కూడా జాబ్ వచ్చింది . జాబ్  రాగానే ఇంటికి వచ్హాడు . నోకియా 6600 అప్పట్లో చాలా మంది డ్రీం ఫోన్ . అది పట్టుకుని వచ్చాడు. రెండు మూడు పాటలు వినిపించాడు . మా ఫాదర్ ని అడిగాడు ఏంటి అంకుల్ మీ వాడు ఏం చేస్తునాడు అని . ఇలా సివిల్స్ ప్రిపేర్ అవుతునాడు  అంటే ఎందుకండీ ఈ సివిల్స్, మొన్నే ఇండియా టుడే లో ఒక ఆర్టికల్ చదవలేదా? ఇపుడు డిమాండ్ ఓన్లీ software ఇంజనీర్స్ కే . IAS లు IPS  లు position  ఎపుడో పడిపోయింది  అంకుల్ అన్నాడు . పైగా IT జాబ్ చాలా challenging  గా ఉంటుంది . మొన్నే డేటాబేస్ మొత్తం క్రాష్ అయిపోయింది . నేను ఒక 3 hours కష్టపడి మొత్తం సెట్ చేశా అని చెప్పాడు  . నేను మనసు లో అనుకున్నా "వీడి హిస్టరీ చూస్తే క్రాష్ చేయడం తప్ప బాగుచేయడం తెలీదు . వీడు డేటాబేస్ క్రాష్ అయితే బాగుచేయడం ఏంటో అనుకున్నా . ఏంటో ఈ విధి ఆడే వింత నాటకం అనుకున్నా ". మా ఫాదర్ కి వాడి మాటలు బాగా వంట పట్టాయి . నన్ను పిలిచి కొన్ని రోజులు జాబ్ చేసి అపుడు మళ్లి ప్రిపేర్ అవ్వొచు కదా అని చెప్పారు . నేను కూడా సివిల్స్ ఫెయిల్యూర్ బాధ లోఉన్నా . వెంటనే హైదరాబాద్ బయల్దేరా . చాలా ఇంటర్వూస్ అటెండ్ అయ్యా . HR ఇంటర్వ్యూ లో ఇన్నాళ్లు ఏం చేసావ్ అనే question కి ఆన్సర్ లేదు . సో చాలా కంపెనీస్ లో rejected . ఫైనల్గా సత్యం లో జాబు వచ్చింది . మా వాడి కర్మ కాలి వాడి టీం లో పడ్డా . అందరికి పరిచయం చేసాడు మా మేనేజర్ . మా వాడు అక్కడ సీనియర్ డెవలపర్ . వాడు ఉన్నాడు కదా హ్యాపీ అనుకున్నా . ఒక రోజు మా మేనేజర్ మా వాడిని పిలిచి software లాంగ్వేజ్ లో బండ బూతులు తిడుతున్నాడు . నాకు లైట్ గా అర్ధం అయింది . మా వాడేదో ఎదవ పని చేసాడు అని  . ఈ నెలలో ఇది మూడోసారి అని మాత్రం అని వినిపించింది . ఒరేయ్ ఏమయింది రా అని అడిగా . డేటాబేస్ క్రాష్ అయింది రా అన్నాడు . మరి నీకు వచ్చు కదరా అపుడు చేశా అని చెప్పావ్ అన్నా . actual  గా అపుడు కూడా నేనే క్రాష్ చేశా అన్నాడు . మరి నువ్వు ఇంటికి వస్తే వేరేలా చెప్తావ్ కదా రా అంటే మా వాడు " ఒరేయ్ IT లో మనషులు రెండు రకాలు ఒకడు పని చేసేవాడు , రెండో రకం మేనేజ్ చేసేవాడు" వెంటనే నేను కొంపదీసి నువ్వు రెండో రకం ఆ అన్నా . మా వాడు అవును అన్నట్టు బ్రహ్మి గాడిలా ఒక expression ఇచ్చాడు., నాకు చిర్రెతుకొచింది. "ఒరేయ్ నువ్వు ఇంకో సారి వూరికి వెళ్ళినపుడు buildup లు ఇస్తే చంపేస్తా " అని వార్నింగ్ ఇచ్ఛా. కర్మ కాలి వాడు నేను ఒకే ప్రాజెక్ట్ . వాడి పని నా పని చేసేటప్పటికి 12 అయ్యేది రోజూ . సివిల్స్ ప్రేపరేషన్ అటకెక్కింది . ఒక రోజు మా మేనేజర్ వచ్చి onsite ఉంది US వెళ్తావా అని అడిగాడు. నాకు నిజం గా ఇష్టం లేదు కానీ ఇంట్లో pressure  వల్ల ఓకే చెప్పాను . ఇంటికి వెళ్లి రావాలనిపించింది . మా వాడు నేను గోదావరి ట్రైన్ లో బయలుదేరాం  . సత్యం t-shirt, bag వేసుకుని కూర్చున్నాం . ట్రైన్ లో పక్కాయన మీరు సత్యం ఆ అని అడిగారు. చాలా గర్వం గా అవునండి అని చెప్పాం . వెంటనే అయన "మన రాజు గారి కంపెనీ చాల మంచి కంపెనీ అది అందులో జాబ్ రావాలంటే చాలా తెలివయిన వాళ్ళయి ఉండాలి . అయినా ఈ రోజులన్నీ software  వాళ్ళవే. అయినా గవర్నమెంట్ జాబ్ చేసి ఎన్నాళ్ళు సంపాదిస్తాం" ఈ టైపు లో చాలా సేపు ఉపన్యాసం ఇచ్చాడు . నేను మనసు లో అనుకున్నా "దిగేవాడికి తెలుస్తుంది నది లోతెంతో. ". ఆయన "సర్ మా వాడు ఇంజనీరింగ్ అయింది . మా వాడికి ఏదన్న జాబ్ చుడండి అన్నాడు . " నేను "సర్ మేము మహా అయితే resume ఫార్వర్డ్ చేస్తాం అంతే కానీ జాబు ఇప్పించలేమ్ " అని చెప్పేలోపు మా వాడు తగులుకున్నాడు. "నాకు పంపించండి నేను చూసుకుంటా . మా మేనేజర్ తో మాట్లాడి జాబు ఇప్పిస్తా " అన్నాడు . నేను వాడిని పక్కకి పిలిచి "ఎందుకురా డాబులు కొట్టడం " అన్నా . వాడు మనమేదో చేస్తాం అని ఆశ తో బతుకుతాడు కదరా అన్నాడు . నువ్వింత ఎదవ ఏంటి రా అన్నా . వాడి trademark స్మైల్ ఒకటి ఇచ్చాడు . ఇంటికి వెళ్లి వచ్చా . వారం లో ప్రయాణం . మనసంతా ఏదో టెన్షన్ . వెళ్ళాల్సిన రోజు వచ్చింది . మమ్మీ డాడీ మా వాడు airport కి వచ్చారు . వాళ్ళని చూసి ఇంకా ఏడుపోచ్చిన్ది . ఫస్ట్ టైం ఫ్లైట్ . US లో దిగాను. వింటర్ అనుకుంటా . వాచి పోయే చలి. మనకేమో ఫుల్ ఎండలు . దేవుడు ఎవరిని ప్రశాంతం గా ఉండనివ్వడు అనుకున్నా . ఒక 10 రోజుల తర్వాత adjust అయ్యా . వన్ ఫైన్ డే లేచా . ఏదో తేడా కొడుతుంది అనుకున్నా . మా మేనేజర్ నుండి మెయిల్ వచ్చింది. మా వాడు కూడా US వస్తునాడని మెయిల్  . ఇపుడు వీడి వర్క్ కూడా నేనే చేయాలి రా బాబు అనుకున్నా. కానీ మనసు లో ఏదో మూల ఆనందం, కంపెనీ దొరుకుతుందని. వాడిని రిసీవ్ చేసుకోడానికి airport  కి వెళ్ళా. వీడు కనపడలేదు . అంతా వెతికా . ఒక మూల కుర్చుని ఇద్దరు US అమ్మాయిలకి సైట్ వేస్తునాడు . ఒరేయ్ ఇలాంటి పనులు చేస్తే ఇక్కడ కేసు రా , passport  కూడా సీజ్ చేస్తారని భయపెట్టి తీసుకొచ్చా .  5 నెలల తర్వాత ఇండియా వచ్చేసాం.  జీవిత ఖైధు  తర్వాత బయటకి వచ్చిన ఖైధీ పడ్డ ఆనందం ఎలా ఉంటుందో అలా ఉంది . మా వాడు మాత్రం బాగా డిసప్పాయింట్ అయ్యాడు . ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది . లైఫ్ హ్యాపీ గా సాగుతుంది అనుకునే లోపు recession స్టార్ట్ అయింది. 10000 మందిని తీసేసారు. ఎవడు ఎపుడు పోతునాడో అర్ధం కావట్లేదు. ప్రాజెక్ట్ లో ఉన్నాం కాబట్టి తియ్యరు అని చిన్న నమ్మకం. ఒక రోజు మార్నింగ్ రాగానే access  card పని చేయలేదు . గుండెల్లో రాయి పడిపోయింది. జాబ్  పోయిందని మెంటల్ గా ఫిక్స్ అయ్యా . సెక్యూరిటీ వాళ్ళని అడిగా మెల్లగా access  card పని చేయట్లేదని. "సారీ సర్ access లో ఏదో ప్రాబ్లం ఉందని" చూసి ఇచ్చాడు . పోయిన ప్రాణం తిరిగి వచ్చిన ఫీలింగ్ . బిక్కు బిక్కు మంటూ బతుకు తున్నాం. దీనమ్మా జీవితం గవర్నమెంట్ లో peon జాబు బెటర్ రా అనిపించింది. cafeteria లో ఏ టాపిక్ మాట్లాడినా చివరికి ఎవరినో ఒకరిని తీసేసారు అని చెప్పుకోడం. జీవితం లో ఏదో కోల్పోయిన ఫీలింగ్ . దీనికి  తోడు TV9 వాడు 30 మినిట్స్ ప్రోగ్రాం లో software ఇంజనీర్స్ ఇంతకు ముందు కార్ లో తిరిగే వారు ఇపుడు ఆటో లకి కూడా డబ్బులు లేవు, ఇంతకు ముందు imax  లో ఉండేవారు ఇపుడు లోకల్ theatres లో చుస్తునారు అని పిచ్చి comparisons తో పరువు మొత్తం తీసేసాడు . ఏం చేస్తున్నావ్ బాబు అని ఎవరన్నా అడిగితే software అని చెప్పుకోడానికి సిగ్గేసేది .  సివిల్స్ కి చదవడం మొదలు పెట్టా మునుపటి concentration లేదు. కష్టపడి చదవాల్సి వచ్చేది . ఈ లోపు ఇంట్లో పెళ్లి చేసుకోమని గొడవ . software  ఇంజనీర్ కి పిల్లని కూడా ఎవరు ఇవ్వట్లేదు TV 9 దయ వల్ల . హీరో లా ఉండే software  ఇంజనీర్ ని recession జీరో ని చేసింది . 
అయినా నా పేజి కి నేనే హీరో ఎందుకంటే software ఇంజనీర్ అనేవాడు అందరికంటే టాక్స్ లు ఎక్కువ కట్టే ఒక అమాయకుడు , క్రెడిట్ కార్డు బిల్లులు కడతాడు, పర్సనల్ లోన్స్ కి ఇంట్రెస్ట్ కడతాడు , ఒక వస్తువు రేట్ కంటే ఎక్కువ పెట్టి కొనుకునే అమాయకుడు, ఆటో వాడు తిట్టినా సినిమా హీరో కొట్టినా ధైర్యం గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేని వెర్రి వాడు , passport  చేయించుకోవాలంటే 7 డేస్ లీవ్ తీసుకుని broker ని బతిమాలుకునే అమాయకుడు, వోట్ వెయ్యాలంటే ఒక డే లీవ్ తీసుకుంటే మళ్లి  కజిన్ పెళ్ళికి లీవ్ పెట్టుకోలేనని లీవ్ పెట్టుకోని ఒక అమాయకుడు, ఎవరన్నా ఈజీ గా మోసం చెయ్యగల సత్తె కాలపు సత్తయ్య మన software ఇంజనీర్ .


  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Email ThisBlogThis!Share to XShare to Facebook
Newer Post Older Post Home

0 comments:

Post a Comment

Featured post

My appraisal........

IT లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి తెలిసిన పదం - APPRAISAL . IT  లో లేని వాళ్ళకి బ్రీఫ్ ( సంక్షిప్తముగా)గా చెబుతా .  IT లో కొన్ని కంపెనిల్లో...

Categories

  • 16
  • aquaman
  • Articles
  • avengers
  • batman
  • counts
  • detail
  • english
  • English movies
  • flash
  • Galaxy English
  • Ghazi
  • Guardians
  • Guru
  • hollywood
  • Hugh Jackman
  • hulk
  • India
  • Introduction
  • jai lava kusa
  • justice league
  • karthi
  • katamarayudu
  • Khakhee
  • Logan
  • mahanubhavudu
  • Movies
  • Pakistan
  • Pawan
  • police
  • ragnarok
  • rakul
  • Ritika
  • Sala khadoos
  • Sarcasm
  • serials
  • spyder
  • stark
  • Stories
  • submarine
  • superman
  • Telugu
  • Telugu Dubbed
  • Telugu movie
  • Thor
  • Tollywood
  • Venkatesh
  • war
  • wolverine
  • wonder woman
  • X-Men

Blog Archive

  • ►  2017 (24)
    • ►  November (4)
    • ►  October (1)
    • ►  August (5)
    • ►  July (4)
    • ►  June (4)
    • ►  May (1)
    • ►  March (4)
    • ►  February (1)
  • ►  2016 (7)
    • ►  November (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (3)
  • ►  2014 (1)
    • ►  July (1)
  • ▼  2013 (2)
    • ►  September (1)
    • ▼  May (1)
      • Software Engineer - Na page ki nene hero :):)
  • ►  2012 (9)
    • ►  December (9)

Popular Posts

  • The Jungle Book - DD's review
  • Dashavatharalu - 1...........
  • Dunkirk - DD review
  • Brahmotsavam - DD's review
  • Zootopia - DD's review

Pages

  • Home
Powered by Blogger.

Find us on:

Facebook Twitter Google+

Ads

Total Pageviews

Copyright © నా అంతరాత్మ!!! | Powered by Blogger
Design by Hardeep Asrani | Blogger Theme by NewBloggerThemes.com | Distributed By Gooyaabi Templates