నా అంతరాత్మ!!!
  • Home
  • Poems
  • Short stories
  • Articles
  • Web Series
  • Reviews
    • Movies
      • Telugu
      • English
    • Apps
  • Uncategorized

Monday, 31 December 2012

vellostha......itlu mee 2012

 RamKi     09:59     Articles, Telugu     No comments   

ప్రతీ సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా  మీకు వీడ్కోలు చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను ......ఇంతకీ నేను ఎవరు అనుకుంటున్నారా ....2012 సంవత్సరాన్ని .....ఎప్పటిలాగే మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది'......కానీ అంతకంటే దారుణమైన దిగ్బ్రాంతి, అవమానం నన్నుమరింత బాధకు గురి చేస్తున్నాయి ....డిల్లీ సంఘటన తలుచుకుంటే ..
                                      నేను ప్రపంచం మొత్తం తిరుగుతున్నా ఎందుకో భారతదేశం అంటే వల్లమాలిన అభిమానం ,ప్రేమ ...శాంతి కాముక దేశమని ,సంస్కృతి ,సంప్రదాయాలు అంటే గౌరవం ఇస్తారని ,ముఖ్యం గా ఆడవాళ్ళంటే పరమ పవిత్రం గా చూస్తారని మా పూర్వీకులు ,పెద్దవాళ్ళు(2011,2010,2009.....) ఎంతో గొప్పగా చెప్పడం వల్ల  అనుకుంటా ..
                                          కానీ వాస్తవిక పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి ...మానవ మృగాల పాశవికత్వానికి బలైన సంఘటన భారతదేశ పరువును మంటగలపడమే కాక ,అసలు మనము నాగరిక సమాజంలో ఉంటున్నామా ,లేక తిరిగి ప్రాచీన యుగం వైపు వెళ్తున్నామా అన్న సందేహం కలిగిస్తుంది ....{.గర్భం లో ఆడ పిల్ల అని తెలిస్తే చంపేస్తునారు.... ,ప్రేమించకపోతే చంపేస్తున్నారు...కట్నం తేకపోతే చంపేస్తున్నారు ఎన్నాళ్లీ దౌర్భాగ్యం ....}
                             ఇంతటి హేయమైన సంఘటన జరిగినా మన పాలకుల స్పందన చూస్తే  మనం ఏ యుగం లో ఉన్నామా అన్న సందేహం తప్పక కలుగుతుంది .... ఇంత బాధలో కూడా నాకు సంతోషాన్నిచ్చిన విషయం ఏంటంటే ....భారతదేశం మొత్తం ఈ సంఘటన కి వ్యతిరేకంగా ఒకే తాటి ఫై నిలబడడం,న్యాయం కోసం పోరాడడం ....ఇంకా నాకు భారతదేశం మీద ఉన్న గౌరవం మిగిలి ఉంది....... ఇప్పటివరకు మీ దేశం లో "" పోస్ట్ మార్టం ""  చర్యలు(ఏదయిన సంఘటన జరిగాక మాత్రమే స్పందించే ప్రభుత్వాలు ........నివారణ చర్యలు శూన్యం ....) మాత్రమే చూసాను.....కానీ ఇక ఫై అలా జరగకూడదు .....ఆమె మరణం వృధా పోకూడదు ..... నిందితులకి సరైన శిక్ష పడేలా  దేశం మొత్తం కదలి వచ్చి ఇంకా మీ దేశం లో న్యాయం బ్రతికే ఉందని నిరూపించండి ....
                                                       శిక్షల విషయానికొస్తే వాళ్ళకి వేసే శిక్షలు మళ్లీ "అలాంటి" ఆలోచన వస్తేనే వెన్నులో భయం పుట్టేలా ఉండాలి ...."రసాయనక పుంస్త్వనాశనము" మాత్రమే స్త్రీల ఫై జరిగే అరాచకాలకు సరైన సమాధానం .......ఇలాంటి చర్యలకు ఇదే సరైన సమయం .....భవిష్యత్తులో మీ దేశ  స్త్రీలు ధైర్యంగా బతకాలన్నాకఠిన చర్యలు అనివార్యం .....    
                                                      ఇంతటి నిందని మోస్తూ విషాద హృదయం తో నేను మీకు వీడ్కోలు చెబుతున్నా ......కనీసం నా వారసుడి  (2013) సమయం లో నైనా ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు ......ఆమె చనిపోయింది.......కనీసం న్యాయాన్ని బతికించండి .....ఆమెని  గెలిపించండి .....
                                                                                   మీ ,
                                                                                  2012......     
  
Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Saturday, 29 December 2012

My appraisal........

 RamKi     00:25     Sarcasm, Stories, Telugu     2 comments   

IT లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి తెలిసిన పదం - APPRAISAL . IT  లో లేని వాళ్ళకి బ్రీఫ్ (సంక్షిప్తముగా)గా చెబుతా .  IT లో కొన్ని కంపెనిల్లో ఏడాదికొకసారి కొన్ని కంపెనిల్లో 6 నెలలకి ఒకసారి రేటింగ్స్(స్కూల్ లో ర్యాంకింగ్ లా) ఇచ్చే పధ్ధతిని appraisal అంటాం  . మా మేనేజర్ మనం పోయిన ఏడాది లో మనం ఏం గొప్పగా చేసాం ఏం చెత్తగా చేసాం అని సమీక్షించి చెబుతారు. దానికి తగ్గట్టు నువ్వు ఈ రేటింగ్ లో ఉన్నావ్ అని చెబుతాడు.

మాకు 1,2,3,4,5 రేటింగ్స్ ఉంటాయి. అయితే మొదట్లో దాని అర్ధం తెలుసుకుందామని మా మేనేజర్ ని ఆత్రుతగా అడిగా . 
అయన "1 వస్తే ఇంటికి పంపిస్తారు, 2 అంటే 2 ఛాన్స్ లు ఇచ్చి అప్పుడు బయటకి పంపిస్తారు, 3 అంటే నీ రోజూ పని చేస్తూ అపుడు అపుడు ఇరగదియ్యాలి" అని చెప్పాడు. నిజం చెప్పాలంటే అపుడు అపుడు ఇరగదీసే పని నే నేను 5 రేటింగ్ అనుకున్నా. అయితే పరిస్థితి నాకు పూర్తి గా అర్ధం అయింది. మనం 3 లో ఉన్నాం అన్నమాట అని మనసులో అనుకున్నా. అయినా ఒకసారి తెలుసుకుందామని 4,5 గురించి కూడా అడిగా. మా వాడు, "4 అంటే నువ్వు పని చేసే ప్రతి రోజూ ఇరగాదీస్తూనే ఉండాలి అని చెప్పాడు. మనం చేసే maintenance ప్రాజెక్ట్స్ లో రోజూ ఎలా ఇరగదియ్యాలో నాకు అర్ధం కాలేదు. సర్లే తరవాత appraisal  లో చూద్దాం అనుకున్నా. 5 గురించి ఇంక తెలుసుకోవలనిపించలేదు.ఆవేశం గా వెళ్లి నీరసం గా బయటకి వచ్చా. సర్లే కదా అని మా seniors ని అడిగా అసలు 5 రావాలంటే ఏం చెయ్యాలని?వాళ్ళు చిన్నగా నవ్వి నీళ్ళ పై కాళ్ళు తడవకుండా నడవాలి. ఆఫీసు కి తలకిందులుగా రావాలి . ఇలాంటి ఫీట్స్ చేయాలి చేస్తావా అని అడిగారు. నేను కూడా నవ్వి ఊరుకున్నా . కానీ నాకు 5 కి అర్ధం తెలియలేదు.

నెక్స్ట్ ఇయర్ ఈ సారి మరీ రోజూ ఇరగదియ్యలేదు కానీ బాగానే కష్టపడి పని చేశా. ఈ సారి తప్పని సరిగా మంచి రేటింగ్ రావాలి అనుకున్నా . కాన్ఫరెన్స్ రూం లోకి అడుగుపెట్టా . మా మేనేజర్ తీక్షణం గా మానిటర్ వైపు చూస్తునాడు. జస్ట్ పలకరించా వెళ్లి కూర్చున్నా. మా మేనేజర్ "ఏంటి సెల్ఫ్ రేటింగ్ లో చాలా పాయింట్స్ రాసినట్టున్నావ్" అన్నాడు. అన్నట్టు సెల్ఫ్ రేటింగ్ అంటే చెప్పడం మర్చిపోయా .మనల్ని మనం రేట్ చేసుకోవాలి.మనం మనకిచ్చిన రేటింగ్ తో మన మేనేజర్ ఏకీభవిస్తే మనకు మంచి రేటింగ్ వస్తుంది. 5 నిమిషాల నిశబ్దం తర్వాత మా మేనేజర్ "సరే లాస్ట్ ఇయర్ ఎం చేసావో చెప్పు అన్నాడు". బాగా ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఒక అరగంట అది చేశాను ఇది చేశాను అని గుక్క తిప్పుకోకుండా ఏం చేసానో చెప్పాను ? మా వాడు సింపుల్ గా "that's all part of job(అదంతా పని లో భాగం)" అని గాలి తీసేసాడు. వారం రోజులనుండి ఏం చెప్పాలి ఎలా మాట్లాడాలి అని చేసిన ప్రాక్టీస్ అంతా వృధా అనిపించింది. నా అయోమయపు మొహం చూసి  సరే ఇపుడు నేను చెబుతాను చూడు అని మా మేనేజర్ స్టార్ట్ చేసాడు 
"నువ్వు వర్క్ బాగానే చేస్తావ్ కానీ బిహేవియర్ మైనస్ అన్నాడు, నీకు visibility కూడా లేదు "  అనగానే నాలో నేను "arguments లో ఎప్పుడు ఉండను కదా. అమ్మాయిలతో కూడా బాగానే behave చేస్తాను కదా,హెల్పింగ్ నేచర్ కూడా ఉంది....కొంపదీసి మా పక్క టీం అమ్మాయికి సైలెంట్ గా సైట్ కొట్టిన విషయం గాని తెలిసిపోయిందా....చివరాకర్లో visibility లేదన్నాడు అది లేకే కదా లెన్స్ పెట్టుకుంటుంది. అది కూడా చూస్తారా!! " అనుకున్నా. సర్లే మన వాడిని అడిగి తెలుసుకుందాం అనుకున్నా . అడిగా. నువ్వు నీ టీం లో ఉన్న వాళ్ళతో మాత్రమే మాట్లాడుతావ్. పక్క టీం వాళ్ళతో అసలు మాట్లాడవు . చాలా reserved గా ఉంటావ్. పని ఉన్నా లేకపోయినా వెళ్లి మాట్లాడాలి అని చెప్పాడు . (పక్క టీం లో అమ్మాయిలు బాగుంటే మాట్లాడుతాం . లేకపోతే ఎందుకు మాట్లాడుతాం అనుకున్నా ). నువ్వెవరో పది మందికి తెలియాలి నువ్వు మహా అయితే మన టీం లో తెలుసు అంతే కదా అన్నాడు. department మొత్తం తెలియాలి అన్నాడు(నేనేమన్నా ఎలక్షన్ లో పోటి చేస్తున్నానా అనుకున్నా ). కానీ నేను బాగానే పని చేశాను కదా అన్నాను. పని ఎవడన్నా చేస్తాడు అన్నాడు. అందుకే నీకు 3 ఇస్తున్నా అన్నాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది . మరి ఆ vishal గాడికి 5 ఎలా ఇచ్చావ్ వాడు అస్సలు పనే చేయడు కదా అన్నాను. మా వాడు వెంటనే "నీకు ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయా నువ్వు emotions ని కంట్రోల్ చేసుకోలేవు, listening స్కిల్స్ కూడా తక్కువ అన్నాడు. ఇపుడే చూసా అన్నాడు " 3 రేటింగ్ తో వచ్చా. అందరిలాగే "న్యాయానికి రోజుల్లేవు,పనికి వేల్యూ లేదు,లోకం పాడయిపోయింది " అని అపుడే M ,Phil కంప్లీట్ చేసిన వాడిలా ఫిలాసఫీ మాట్లాడుకుంటూ బయటకి వచ్చా.

నా తక్షణ కర్తవ్యం అర్ధం కాలేదు. నేను డల్ గా ఉండటం చూసి మా లీడ్ వచ్చి పరిస్థితి అర్ధం చేసుకుని "భయ్యా! నీకు ఇంకా IT అలవాటైనట్టు లేదు. రేటింగ్ లన్నీ ముందే ఫిక్స్ అయిపోతాయి. నీతోనే నువ్వు చేసింది తప్పనిపించి వాళ్ళు అనుకున్నది ఇచ్చే process నే రేటింగ్ అంటారు. ఆ మర్మం తెలుసుకుని వాడిచ్చిన రేటింగ్ ని తీసుకుని calm గా వచ్చేస్తే మన విలువైన సమయం వృధా అవ్వదు." అని ఉపదేశించాడు. మరి 5 ఎవరికి రాదా అని అడిగాను. చిన్నగా నవ్వి "వస్తుంది. బాగా biscuits వెయ్యాలి,సోప్ బాగా రాయాలి,వాడు చెప్పిన పని కాదనకుండా చెయ్యాలి,కుదిరితే ఒక సిగరెట్ వీలైతే నాలుగు పెగ్స్ తో పార్టీ ఇవ్వాలి. అలా చేస్తే అవార్డ్స్ వస్తాయి,రేటింగ్స్ వస్తాయి . అదే మన పని మనం చేసుకుని కాలం వెళ్ళిపోతే మనశాంతి వస్తుంది.ఏది కావాలో తేల్చుకో అని వెళ్ళిపోయాడు ". యుద్ధం లో అస్త్ర శాస్త్రాలు వదిలేసిన అర్జునుడికి కృష్ణుడు భగవద్గీత ఉపదేశించినట్టు అనిపించింది. ఆ తర్వాత ఇయర్ appraisal అంతా చాలా తొందరగా అయిపోయింది ఎందుకంటే మా వాడు చెప్పినట్టు తలాడించి వాడిచ్చింది తీసుకుని బయటకు వచ్చేసా . మనసుకి చాలా బాగా అనిపించింది. ఇదేనా మా లీడ్ చెప్పిన మర్మం అనుకున్నా . appraisals కి అలవాటు పడిపోయా.

(Disclaimer : నాకు రేటింగ్ తక్కువ వచ్చిందని కడుపు మంట తో రాయలేదు. నాకు మా మేనేజర్ మంచి రేటింగ్ ఇచ్చాడు. మా ఫ్రెండ్స్ కి, నాకు జరిగిన అనుభవాలు అన్ని ఒక్కటి గా చేసి రాసింది, సరదా కోసం......చివరిగా అందరి మేనేజర్ లు ఒకేలా ఉండరు.:) )
Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Tuesday, 25 December 2012

bhuvaneswarudu......

 RamKi     20:06     Articles, Telugu     No comments   

నిన్న భారత్ - పాక్ T 20 లో భారత్ వోడిపోయినా చిన్న ఆనందం - భువనేశ్వర్ కుమార్.
ప్రభాకర్,ప్రవీణ్ కుమార్ తరహా లో బంతి ని రెండు వైపులా స్వింగ్ చేసిన తీరు చాలా బాగుంది. ముఖ్యం గా జంషెడ్ ని అవుట్ చేసిన తీరు అధ్బుతం. 4 బంతులు అవుట్ స్వింగ్ చేసి ఒక ఇన్ స్వింగ్ తో బౌల్డ్ చేసాడు. ఉమర్ అక్మల్ బౌల్డ్ అయితే సూపర్. ఇన్నాళ్ళకు మంచి ఫాస్ట్ బౌలింగ్ చూసాను అనే తృప్తి కలిగింది. చిన్న భయం కూడా వేస్తుంది. ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇలాగే మొదట్లో బాగానే బౌలింగ్ చేసాడు. తరవాత MRF pace ఫౌండేషన్ కి పంపించి ఉన్న పేస్ ని స్వింగ్ ని తీసేసారు. BCCI వాళ్ళకి విజ్ఞప్తి దయచేసి భువనేశ్వర్ ని MRF  pace foundation కి పంపించొద్దని మనవి.
Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Nero Chakravarthi tharahaa lo mana prabuthvam....

 RamKi     19:48     Articles, Telugu     No comments   

ఢిల్లీ రేప్ ఘటన పైన మన ప్రభుత్వ పెద్దలు స్పందించిన తీరు నీరో చక్రవర్తి చందాన  ఉంది.
రోమ్ నగరానికి చక్రవర్తైన నీరో రోమ్ నగరం తగలపడిపోతుంటే రోమ్ అవతల ఫిడేల్ వాయిస్తూ గడిపాడని ఒక చారిత్రిక విమర్శ ఉంది.
మన పాలకుల పరిస్థితి కూడా అలానే ఉంది.
మన గౌర్వనీయిలైన CM గారిని స్పందించమంటే అక్కడెక్కడో జరిగిన సంఘటన కి నేనెందుకు స్పందించాలి అన్నారు. మన CM  గారు ఇక్కడ ఒక ప్రాథమిక విషయాన్ని మరిచిపోయారు. చిన్నపుడు స్కూల్ స్టార్ట్ అయ్యేది ఒక ప్రతిజ్ఞ తో - "all indians are my brothers and sisters ani......భారతీయులందరూ నా సహోదరులు....". మరి ఈ విషయం మరిచిపోయినట్టున్నారు. లేకపోతే ఢిల్లీ ఏ యుక్రెయిన్ లోనో ఇరాన్ లోనో ఉందని అనుకున్నారో ఆయనకే తెలియాలి. లేక ఏం  మాట్లాడితే ఏం వివాదం జరుగుతుందో అని భావించారో .
మన PM  గారు నోరు విప్పడానికి వారం రోజులు పట్టింది.
మనల్ని కాపాడాల్సిన మన HM గారిని వెళ్లి ధర్నా చేస్తున్న విద్యార్థులతో మాట్లాడండి అంటే వాళ్ళలో mavoists (నక్సలైట్) లు ఉన్నారేమో అన్నారు......
ఇంక మన PCC అధ్యక్షుడు గారు "ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరగడం ఎందుకు స్వతంత్రం వచ్చినంత మాత్రాన" అన్నారు.తర్వాత ఉపసంహరించుకున్నారనుకోండి. 9:30 PM  కూడా అర్ధరాత్రా?
ఈ ఘటన సగటు భారతీయుడిని కలచివేసిన కారణం ఇంత అభద్రత లో మనం బతుకుతున్నాం అనే భయం. మరి మన పాలకుల లైట్ గా ఎందుకు తీసుకున్నారు ? వాళ్ళకి,వాళ్ళ బంధువులకి Z-category భద్రత ఉండటమేనా?

మనం పాశ్చాత్య దేశాల నుండి ఒక విషయం నేర్చుకోవాలి - ఒక ఘటన జరిగితే వాళ్ళు స్పందించే తీరు మరియు త్వరగా శిక్షలు అమలు చేసే విధానం .

కెనడా లో 12 నుండి 18 సం . శిక్ష 
ఫ్రాన్స్ లో 15 నుండి 30 సం . శిక్ష 
న్యూజిలాండ్ లో 12 సం.
జపాన్ లో 10 సం.
UK లో జీవిత కాలం జైలు లో గడపాల్సిందే.
అరబ్ దేశాలలో మరణ శిక్ష. 
భారత దేశం లో కూడా sec 376 IPC ప్రకారం 10 సం. శిక్ష. కాని అమలు చేసే విధానం లో జాప్యం.

30 రేప్ కేసు లు 10 సం.నుండి కోర్ట్ తీర్పు కి నోచుకోలేదు. విద్యార్ధులు రోడ్ ల పైకి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే శిక్షలు తొందరగా అమలు అవుతాయన్న నమ్మకం లేక, న్యాయం జరుగుతుందన్న నమ్మకం సన్నగిల్లడం వల్ల  .

"justice delayed is justice denied " - ఈ విషయం మనవాళ్ళు తెలుసుకుని తొందరగా న్యాయం చేస్తే బాగుంటుంది. లేకపోతే జనాలు తిరగబడతారు . కాదు తిరగబడ్డారు .
Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Monday, 24 December 2012

dashavatharalu - 3

 RamKi     19:55     Stories, Telugu     No comments   

వామన:
 అసుర రాజైన  బలి ప్రహ్లాదుడి ముని మనవడు మరియు మహా విష్ణు భక్తుడు. బలి చక్రవర్తి భూమి ని,పాతాళాన్ని జయించి స్వర్గం పైకి దండెత్తుతాడు . 100 అశ్వమేధ యాగాలు చేస్తే శాశ్వతంగా స్వర్గానికి బాలి రాజవుతాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు విష్ణువు ని వేడుకుంటాడు బలి  ని అడ్డుకోమని.అపుడు మహా విష్ణువు "బలి సత్ప్రవర్తన గల రాజు, దాన శీలి, పైగా నా భక్తుడు.నేను ఎలా అడ్డుకోగలను" అని ఇంద్రుడికి చెబుతాడు.అపుడు ఇంద్రుడు బలి మంచి రాజైనా, స్వర్గం రాక్షషుల పాలవుతుంది,ఇది శుభ పరిణామం కాదు అని చెబుతాడు.అపుడు విష్ణువు నేను బలి ని చంపను ,అతని శక్తులు హరించను నీ స్వర్గంనుండి మాత్రం పంపిస్తాను అని చెబుతాడు. శ్రీ మహా విష్ణువు వామన(మరుగుజ్జు) రూపం లో పుట్టి బాలి చక్రవర్తి దగ్గరకి దానం తీసుకోడానికి వెళ్తాడు.అసుర రాజైన శుక్రాచార్యుడు ఆ తేజస్సు ని గమనించి అయన శ్రీ మహా విష్ణువు అని గ్రహిస్తాడు.బలి ని అనేక రకాలుగా వారిస్తాడు.బలి  ఆయన మాట వినక ఏమి దానం కావాలి అని అడుగుతాడు, అపుడు వామనుడు 3 అడుగుల స్థలం కావాలంటాడు. సభ లో అందరూ నవ్వుతారు.బలి సరే తీసుకోమని చెప్పగా ఒక అడుగు భూమి మీద రెండో అడుగు పాతాళం పైన వేసి మూడో అడుగు ఎక్కడ వెయ్యాలని బలి  ని అడుగుతాడు.బలి వామన రపం లో వచ్చింది విష్ణువు అని గ్రహించి తన శిరస్సు పైన మూడో అడుగు వెయ్యమని చెబుతాడు. వామనుడు బలి ని పాతాళానికి తొక్కేస్తాడు.శ్రీ హరి సంతోషించి బలి ని పాతాళాన్నిఏలుకో మని చెప్పి,నువ్వు కీర్తిమంతుడి గా ఎప్పటికీ నిలిచిపోతావని చెబుతాడు.

పరశురాముడు: 
 పరశు అనగా గొడ్డలి, శివ ప్రసాదం . పరశురాముడు జమదగ్ని మరియు రేణుక ల సంతానం. కార్తవిర అర్జునుడు  హైహయ దేశపు రాజు . ఒక సారి రాజు,రాజు సైన్యం జమదగ్ని ఆశ్రమానికి విడిది చేయడానికి వచ్చారు . కామధేనువు సాయం తో జమదగ్ని ఆ రాజు సైన్యానికి విడిది ఏర్పాటు చేయగలిగాడు . అప్పుడు రాజు జమదగ్ని ని అడిగాడు ఇది ఎలా సాధ్యపడిందని. కామధేనువు ని చూపించి అది ఇంద్ర ప్రసాదం అని చెబుతాడు. రాజు కి పాడు బుద్ధి పుట్టి ఆ కామధేనువు ని తస్కరిస్తాడు. పరశురాముడు కోపంతో కార్తవీర్యుడిని చంపి కామధేనువు ని తీసుకువస్తాడు . పరశురాముడు లేని సమయం చూసి కార్తవీర్యుడి కొడుకులు జమదగ్ని ని సంహరించి తల తీసుకువెళ్తారు. ఆ బాధతో తన తల్లి మరణిస్తుంది . పరశురాముడు తల్లి తండ్రుల మరణం విని కోపం తో, కార్తవీర్యుడి కుమారులుని చంపడమే కాక క్షత్రియ వంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞబూనుతాడు . 21 క్షత్రియ వంశాల్ని చంపుతాడు. పరశురాముడు చిరంజీవి ఎప్పటికి బతికే ఉంటాడని హిందువులు నమ్ముతారు.

తరవాతి అవతారం రాముడు , కృష్ణుడు, -------
తరువాత బుద్దుడని కొందరు,బలరాముడని కొందరు చెబుతారు.
చివరి అవతారం కల్కి.....ఇది కలియుగావతరం.


 కల్కి: 
 కల్కి తెల్లని గుర్రం పై , జ్వలించే ఖడ్గం పట్టుకుని కలి ని అంతం చేయడానికి వస్తాడు అని అంటారు. యుగాంతం కి కల్కి , కలి ని అంతం చేస్తాడు.
Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Dashavatharalu - 2

 RamKi     08:07     Stories, Telugu     No comments   

వరాహ:

బ్రహ్మ పుత్రులైన సనక,సనందన,సనాతన,సనత కుమారులు విష్ణువు దర్శనం కోసం వైకుంటం వస్తారు. ద్వార పాలకులైన జయ, విజయులు , ఆ ఋషులు దిగంబరులై ఉండటం వల్ల వాళ్ళని అడ్డుకుంటారు.ఆ ఋషులు కోపోద్రిక్తులై మిగతా జన్మలన్నీ భూమి మీద పుట్టమని శపిస్తారు. శ్రీ మహా విష్ణువు ని వదిలి ఉండలేని జయ,విజయ లు విష్ణువు ని వేడుకుంటారు శాప విమోచనం కోసం. విష్ణువు 7 జన్మలు మంచి వాళ్ళలా పుడతారా లేక 3 జన్మలు రాక్షసులు గా  పుడతారా అనగా మేము 7 జన్మలు మిమ్మల్ని విడిచి ఉండలేము అని 3 జన్మలు రాక్షసులు గా  పుట్టడానికి అంగీకరిస్తారు. హిరణ్యాక్షుడు - హిరణ్యకశిపుడు, రావణుడు - కుంబకర్ణుడు, శిశుపాలుడు - దంతవక్త్రుడు గా  పుడతారు.
                                                          హిరణ్యాక్షుడు పాపాలు చేస్తూ దేవతల్ని యుద్ధానికి ఉసి గొల్పుతూ ఉంటాడు.  దేవతల్ని జయించి విష్ణువు ని ఉసి గోల్పడానికి భూమి ని పాతాళం లో దాచేస్తాడు. దేవతలు విష్ణువు ని వేడుకోగా బ్రహ్మ ముక్కు నుండి చిన్న వరాహం పుడుతుంది. ఆ చిన్న వరాహం బ్రహ్మ చూస్తుండగానే భారీ ఆకారం గా మారి పాతాళం లో ఉన్న భూమి ని తన కొమ్ము పైన పెట్టుకుని హిరణ్యక్షుడితో యుద్ధానికి దిగుతాడు. 1000 సంవత్సరాల  యుద్ధం తర్వాత విష్ణువు హిరణ్యక్షుడిని సంహరిస్తాడు.

నరసింహావతారం:

హిరణ్యకశిపుడు బ్రహ్మ గురించి గోరమైన తపస్సు చేసి ఒక వరం పొందుతాడు. ఆ వరం ఏమంటే "మనిషి చేత గాని ,జంతువు చేత గాని , బయట గాని ,లోపల గాని, భూమి మీద గాని,అంతరిక్షం లో గాని,జీవం ఉన్న ఆయుధం తో గాని, జీవం లేని ఆయుధం తో గాని మరణం లేకపోవడం". హిరణ్యకశిపుడు తనని తాను  దేవుడి గా ప్రకటించుకుని విష్ణువు ప్రార్థన మాని తన ప్రార్థన చెయ్యాలని హింసిస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాలకి హిరణ్యకసిపుడికి ప్రహ్లాదుడు జన్మిస్తాడు. ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడిగా మారుతాడు అది నచ్చని హిరణ్యకశిపుడు కొడుకుని దండించాలని చూస్తాడు. అయినా ప్రహ్లాదుడు విష్ణు నామస్మరణం మానడు . ప్రహ్లాదుడిని అనేక రకాలుగా చంపడానికి చూస్తాడు హిరణ్యకశిపుడు. అన్ని ప్రయత్నాలు విఫలం చెందుతాయి. ప్రహ్లాదుడిని విష్ణువు ఎక్కడున్నాడో చూపించమని అడగగా జగమంతా విష్ణువే అని చెబుతాడు. అయితే ఈ గోడ నుండి విష్ణువు ని రమ్మను అని గోడ బద్దలు కొడతాడు . విష్ణువు నరసింహావతారం(మనిషి కాదు జంతువు కాదు) లో వచ్చి ద్వారం దగ్గర(బయట కాదు ,లోపల కాదు ) తన వొడిలో(భూమి మీద కాదు ,అంతరిక్షం లో కాదు ) పడుకోబెట్టి గోళ్ళతో(జీవం ఉన్న ఆయుధం తో గాని, జీవం లేని ఆయుధం తో గాని) పొట్ట చీల్చి చంపుతాడు .


పైవన్నీ సత్యయుగ అవతారాలు .............

త్రేతాయుగ అవతారాలు తర్వాత పోస్ట్ లో ...................

Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Dashavatharalu - 1...........

 RamKi     04:17     Stories, Telugu     4 comments   

నన్ను బాగా inspire చేసిన మూవీస్ లో కృష్ణం వందే జగద్గురుం ఒకటి . క్లైమాక్స్ సాంగ్ లో దశావతారాలు ఏంటో వాటి  ప్రాముఖ్యత ఏంటో చక్కగా చెప్పారు. దశావతారాలు లో కొన్ని అవతారాలు  గురించి
తెలుసు కానీ ....ఆ అవతారాలు, వాటి కథలు తెలీవు . ఇంటర్నెట్ లో రీసెర్చ్ చేసి రాసిన దశావతారాల కథలు ఇవి:

మత్స్యం :
 దశావతారాల్లో మొదటిది. మత్స్యపురాణం ప్రకారం ఒక రోజు సత్యవ్రతుడు(మను) తీవ్రంగా చేస్తున్న తప్పస్సుని తాత్కాలికంగా విరమించి ఉదయాన్నే స్నానం చేస్తున్నాడు. చిన్న చేప పిల్ల నన్ను రక్షించు అని సత్యవ్రతుడిని వేడుకుంది. ఆయనకి మనసు కరిగి ఆ చేప పిల్లని చిన్న కూజా లో పెట్టాడు. అది మరుసటి రోజుకి ఆ కూజా పట్టనంత పెద్దగా పెరిగిపోయింది. అప్పుడు సత్యవ్రతుడు చిన్న కొలను లో పెట్టాడు.కొలను కూడా సరిపోనంత పెద్దగా పెరిగిపోయింది. గంగా  నది లో పెట్టాడు. మరింత పెద్దగ పెరిగింది. మహా సముద్రం లో పడేసాడు. అయినా సరిపోలేదు. అప్పుడు ఆ రాజు కి ఆ చేప శ్రీ మహా విష్ణువు అని బోధ పడింది. శ్రీ మహా విష్ణువు ప్రత్యక్షమయి ప్రపంచం ఇంకో 7 రోజుల్లో అంతం అయిపోతుందని , ఒక పెద్ద పడవ (boat ) నిర్మించమని  చెబుతాడు. ఆ పడవ  కి ఒక కొన వాసుకి(విష్ణువు శయనం)ని  కట్టి , మరొక చివర మస్త్యావతరం లో విష్ణువు హిమ పర్వతం వరకు లాక్కొని వెళ్ళాడు. తర్వత శకం అపుడు ప్రారంభం అయింది. జియోలాజికల్ క్యాలెండర్ ప్రకారం జీవం పుట్టింది నీళ్ళ లో. మత్స్యావతారం తో అందుకే దశావతారాలు ప్రారంభం అయ్యాయి కాబోలు.

కూర్మం:

దుర్వాస మహాముని ఇంద్రుడికి పూలమాల పంపించాడు. ఇంద్రుడు ఆ పూల మాల ని తన ఏనుగు కి ఇచ్చాడు. అది ఆ పూల మల కి తొక్కేసింది. ఈ విషయం తెలిసి దుర్వాసుడు కోపం తో దేవతల శక్తీ నశించి పోవాలని శపించాడు. దేవతల శక్తీ నశించి పో సాగింది. అపుడు శ్రీ మహా విష్ణువు అమృతం తాగితే నీ శక్తి  మళ్లీ  తిరిగి వస్తుందని చెబుతాడు. మందార పర్వతం తో, పాల సముద్రాన్ని చిలకాలని చెబుతాడు. దేవతల శక్తీ చాలక రాక్షసుల  సాయం తో పాల సముద్రం (క్షీర సాగరం) ని చిలకడం ప్రారంభిస్తారు. సముద్రాన్ని చిలకడానికి వాసుకి(పాము) ని ఉపయోగిస్తారు. దేవతులు తల బాగం మేము పట్టుకుంటాం మీరు తోక పట్టుకోండి ఆని  చెబుతారు. రాక్షసులు ఇందులో మాయేదో ఉందని తల భాగం పట్టుకోడానికి పట్టు బడతారు. మందార పర్వతం బరువుకి పాల సముద్రం లో  మునిగిపోతుంటుంది. అపుడు మహా విష్ణువు తాబేలు రూపం లో మందార పర్వతం మునిగిపోకుండా పట్టుకుంటాడు. అమృతం రాగానే అసురులు తీసుకుంటారు. శ్రీ మహా విష్ణువు అప్సర రూపం లో వచ్చి మాయ చేసి ఆ అమృతాన్ని దేవతలకి పంచేసి మాయం అవుతాడు.

                                                                                               (సశేషం).......

Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Wednesday, 19 December 2012

kalachivesindi......

 RamKi     20:33     Stories, Telugu     No comments   

నిన్న ఉదయం లేవగానే ఈనాడు పేపర్ తెరచిన వెంటనే మొదటి పేజి లో "ఢిల్లీ లో అత్యాచార ఘటన " అని హెడ్డింగ్ కనపడింది చదవడం మొదలు పెట్టా. మృగాలాంటి ఆరుగురు మగాళ్ళు ఒక వైద్య విద్యార్థిని ని అత్యాచారం చేసి బస్సు నుండి బయటకు విసిరేసారు. ఇదీ న్యూస్ . అందరిలాగే బాధపడ్డా. ఢిల్లీ లో రేప్ లు ఎక్కువయిపోతునాయి అని అనుకున్నా. ఎప్పటిలాగే ఫేస్ బుక్ తెరిచా . అక్కడా అదే న్యూస్ . బ్లాగ్స్ ,ఆన్లైన్ పేపర్స్ చదవడం మొదలుపెట్టా.  ఆమె ని ఆరుగురు రేప్ చేసి రాడ్ తో తీవ్రంగా కొట్టి రోడ్ పైన పడేసారంట .  ఆమె కోమా లో ఉంది . ప్రేగులు బాగా దెబ్బతిన్నాయి . డాక్టర్ ఆమె పరిస్థితి చూసి షాక్ తిన్నాడు. నాలుగు రోజుల్లో ఆరు సార్లు కోమా లోకి వెళ్ళింది .ఆ మృగాలు చేసిన పనేంటంటే ఆమె ని పెళ్లి కి పని చేయకుంట చేసేసారు. ఆమె మర్మాంగం ,ప్రేగులు బాగా దెబ్బ తిన్నాయి. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఈ వార్త చదవగానే మనసంతా ఏదో లా అయిపొయింది . నిజంగా మనకి స్వంతంత్రం వచ్చిందా? అని అనిపించింది. ప్రాబ్లెమ్ ఎక్కడ ఉందా అనిపించింది .

మొఘలులు కాలం లో ఆడపిల్లల్ని ఏడిపించిన ఒక అంతర్గత బద్రతాధికారి కి మరణ శిక్ష విదిన్చారంట . ఏనుగులతో  తోక్కిన్చేవరంట. కళ్ళు పీకిన్చేవరంట . అలాంటి  శిక్షలు మళ్ళి అమలు చెయ్యలా ? అనిపించింది .
ఒక్కటి మాత్రం నిజం మన చట్టాలు మాత్రం మార్చాలి . అంబేద్కర్ అప్పటి ప్రజల్ని చూసి చట్టాలు చేసారు . అప్పటి ప్రజలకి ఆడవాలంటే గౌరవమ్ ,మర్యాద ఉండేవి .ఇప్పటి కాలం లో మనుషులు మారారు . చట్టాలు కూడా మారాలి.
నాయకులూ మారాలి . జనాలు న్యాయం కోసం రోడ్ మీదకు వచ్చే పరిస్థితి ఉంది ఈ దేశం లో. మొన్న జెస్సికా  లాల్  కోసం , నిన్న ఇందిరా ప్రియదర్శిని కోసం ,ఈరోజు ఈమె కోసం. ప్రజలే పాలకులకు ఏం చేయాలో చెప్పాలా? వాళ్ళ బాధ్యత కాదా? మనల్ని రక్షించటం . వాళ్ళ చెల్లెళ్ళు,అక్కలు,బంధువులు కి Z-category  రక్షణ ఉంటె చాలా ? మనకి సాధారణ రక్షణ కూడా ఇవ్వరా? ఈ విషయం జరిగిన వెంటనే బస్సు కిటికిలకి నల్ల అద్దాలు తీసేస్తాం ,curtains తీసేస్తాం ,డ్రైవర్ పేరు బస్సు లో రాయిస్తాం అని వెంట వెంటనే నిర్ణయాలు తీసుకున్నారు కదా ? కనీస safety measures ముందే ఎందుకు ఆలోచించరు ? ఎపుడూ అంతా అయిపోయిన తర్వాతే ఎందుకు పాలకులు
మేలుకుంటారు? ఢిల్లీ రేప్ పై స్పందిస్తూ రాజ్యసభ లో ఒక MP నాకు 17 ఏళ్ళ కూతురు ఉంది ఇలాంటి విషయాలు వింటుంటే భయం వేస్తుంది అంటే, సామాన్యుల పరిస్థితి ఏంటి? 6 PM దాటిన తర్వాత అమ్మాయిలని ఇంట్లోనే ఉంచాలా?
Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Modati Saari

 RamKi     18:51     Introduction     No comments   

మొదటి సారి తెలుగు లో ఒక బ్లాగ్ రాస్తునాను ...... చాలా ఆనందంగా ఉంది......
Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Newer Posts Home

Featured post

My appraisal........

IT లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి తెలిసిన పదం - APPRAISAL . IT  లో లేని వాళ్ళకి బ్రీఫ్ ( సంక్షిప్తముగా)గా చెబుతా .  IT లో కొన్ని కంపెనిల్లో...

Categories

  • 16
  • aquaman
  • Articles
  • avengers
  • batman
  • counts
  • detail
  • english
  • English movies
  • flash
  • Galaxy English
  • Ghazi
  • Guardians
  • Guru
  • hollywood
  • Hugh Jackman
  • hulk
  • India
  • Introduction
  • jai lava kusa
  • justice league
  • karthi
  • katamarayudu
  • Khakhee
  • Logan
  • mahanubhavudu
  • Movies
  • Pakistan
  • Pawan
  • police
  • ragnarok
  • rakul
  • Ritika
  • Sala khadoos
  • Sarcasm
  • serials
  • spyder
  • stark
  • Stories
  • submarine
  • superman
  • Telugu
  • Telugu Dubbed
  • Telugu movie
  • Thor
  • Tollywood
  • Venkatesh
  • war
  • wolverine
  • wonder woman
  • X-Men

Blog Archive

  • ►  2017 (24)
    • ►  November (4)
    • ►  October (1)
    • ►  August (5)
    • ►  July (4)
    • ►  June (4)
    • ►  May (1)
    • ►  March (4)
    • ►  February (1)
  • ►  2016 (7)
    • ►  November (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (3)
  • ►  2014 (1)
    • ►  July (1)
  • ►  2013 (2)
    • ►  September (1)
    • ►  May (1)
  • ▼  2012 (9)
    • ▼  December (9)
      • vellostha......itlu mee 2012
      • My appraisal........
      • bhuvaneswarudu......
      • Nero Chakravarthi tharahaa lo mana prabuthvam....
      • dashavatharalu - 3
      • Dashavatharalu - 2
      • Dashavatharalu - 1...........
      • kalachivesindi......
      • Modati Saari

Popular Posts

  • The Jungle Book - DD's review
  • Dashavatharalu - 1...........
  • Dunkirk - DD review
  • Brahmotsavam - DD's review
  • Zootopia - DD's review

Pages

  • Home
Powered by Blogger.

Find us on:

Facebook Twitter Google+

Ads

Total Pageviews

Copyright © నా అంతరాత్మ!!! | Powered by Blogger
Design by Hardeep Asrani | Blogger Theme by NewBloggerThemes.com | Distributed By Gooyaabi Templates